Feb 26,2021 21:48

మాట్లాడుతున్న ప్రతినిధులు

తెగుళ్ల నివారణకు సూచనలు
ప్రజాశక్తి - గూడూరు రూరల్‌ :ఎఫ్‌ఎంసి కంపెనీ ప్రతినిధులు శుక్రవారం రైతులకు గూడూరు మండల వ్యసాయాధికారి నాగ మోహన్‌ సమక్షంలో కోరాజన్‌ ఈ-బజ్‌ లక్కిడిప్‌ ఆన్‌ లైన్‌ కార్యక్రమంతో 40 మంది రైతులను విజేతలుగా ప్రకటించారు. ఈ కార్యక్రమంలో వరిలో మోమి పురుగు, తెల్లకంకి నివారణకు రైతులు దీర్ఘకాలంపాటు వాడుతున్న ఎఫ్‌ఎంసి కోరాజన్‌ మందును చిరుపొట్ట సమయంలో వాడడం వల్ల మోము పురుగు ఉధృతిని అదుపు చేయవచ్చన్నారు.ఈ సందర్భంగా ఎఫ్‌ఎంసి కోరాజన్‌ 30 ఎంఎల్‌ మందుల కిట్లను ఎంపికైన విజేతలకు అందజేశారు. గూడూరు మండల వ్యవసాయాధికారి ఎస్‌వి నాగ మోహన్‌, ఎఫ్‌ఎంసి కంపెనీ మార్కెటింగ్‌ ఎగ్జిక్యూటివ్‌ రాజేష్‌ ఖన్నా రెడ్డి మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా డివిజన్‌ స్థాయిలో ఈ కార్యక్రమం మూడు వారాలపాటు నిర్వహించనున్నట్లు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా గ్రామ స్థాయిలో వరిని సాగు చేసే 500 మంది అభ్యుదయ రైతులను గుర్తించి ఎఫ్‌ఎంసి మార్గదర్శి కిట్స్‌ పంపిణీ కార్యక్రమం చేపడుతున్నట్లు తెలిపారు. కంపెనీ ప్రతినిధులు సాయి కుమార్‌, రాజ్‌ కుమార్‌ పాల్గొన్నారు.