Nov 29,2020 23:20

kaluva

ప్రజాశక్తి-శింగరాయకొండ: మండలంలో పాకల రోడ్డులోని మర్రిచెరువు కింద ఉన్న కాలువ చెరువులో నీరు తాకిడి ఎక్కువై తెగిపోయిన ఘటన ఆదివారం జరిగింది. ఈ కాలువ తెగిపోవడంతో చెరువు కిందవైపు ఉన్న పొలాల్లోకి వరద నీరు ఉధృతంగా ప్రవహిం చింది. అక్కడ మూలగుంటపాడు, సోమరాజు పల్లి, పాకల గ్రామాలకు చెందిన రైతులు వరి పంట వేసి ఉన్నారు. ఆ నీరు వేగంగా వరి నాట్లు వేసి ఉన్న పంటను ధ్వంసం చేశాయి. దీంతో రైతులు హడావుడిగా వచ్చి పట్టలతో కట్టలు వేసుకున్నా.. ప్రయోజనం లేకుండా పోయింది. వర్షపు నీరు చెరువుల్లోకి వచ్చి.. కాలువల ద్వారా పొలాల్లోకి వచ్చింది. ఈ కాలువలు సైతం తెగిపోయి నాట్లు వేసుకున్న వరి పంటను నాశనం చేశాయని రైతులు వాపోతున్నారు.