Jan 21,2021 21:24

శిక్షణను ప్రారంభిస్తున్న నాగరాజు

ప్రజాశక్తి - కొలిమిగుండ్ల :మహిళలు టైలరింగ్‌ నేర్చుకొని ఆర్థికంగా అభివృద్ధి చెందాలని రాంకో సిమెంట్‌ పరిశ్రమ వైస్‌ ప్రెసిడెంట్‌ రెడ్డి నాగరాజు ఆకాంక్షించారు. గురువారం కొలిమిగుండ్ల కాంప్లెక్స్‌లో రాంకో సిమెంట్‌ పరిశ్రమ సహకారంతో లావణ్య మహిళా మండలి సమైక్య అధ్యక్షులు రోజా రమణి కుట్టు మిషన్‌ శిక్షణ, ఎంబ్రాయిడింగ్‌ శిక్షణను ప్రారంభించారు. ఈ అవకాశాన్ని కొలిమిగుండ్ల, కల్వటాల, నాయిని పల్లి గ్రామాల మహిళలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.