
ప్రజాశక్తి-కందుకూరు: ప్రకాశం జిల్లా తైక్వాండో అసోసియేషన్ నిర్వహించిన 11వ జిల్లా స్థాయి తైక్వాండో పోటీలలో ఆక్స్ఫర్డ్ విద్యార్థులు ప్రతిభ కనబరిచి అత్యధిక పతకాలు సాధించారు. ఫిబ్రవరి 28న బిఆర్ ఆక్స్ఫర్డ్ అకాడమీలో జరిగిన పోటీల్లో వై.భవ్యశ్రీ, ఐ.శ్రుతి, ఐ.శ్రావ్య, జి.అశ్విత, వై.భాస్కర్, ఎస్కె.మన్సూర్, జి.జాషువా, జి.మోజెస్, పి.సోమనాధ్ విజరు బంగారు పతకాలు సాధించారు. వై.మహిత, బి.అక్షర, జి.వరుణ్‌చౌదరి, ఎస్కె.మోహిత్, బి.కష్యప్లు సిల్వర్ మెడల్‌ను గెలుపొందారు. సిహెచ్ ఖాజారహంతుల్లా, సిహెచ్ గీతాంజలి, జి.కార్తిక్, జి.శ్రీహర్షిత్, జె.వెంకటసాయితేజలు బ్రౌంజ్ మెడల్‌ను సాధించినట్లు డైరెక్టర్ బాలభాస్కర్ తెలిపారు. తైక్వాండో మాస్టర్ ఎస్కె.అబ్దుల్ సలామ్ శిక్షణలో వీరంతా మెడల్స్ సాధించారని తెలిపారు. విద్యార్థులను కరస్పాండెంట్ బండి వెంకటేశ్వర్లు, చైర్మన్ ఉన్నం భాస్కరరావులు అభినందించారు.