Oct 28,2021 19:22

samkustapana chestunna mantri perni nani

తాగునీటి సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత : పేర్ని
ప్రజాశక్తి-మచిలీపట్నం కల్చరల్‌
మచిలీపట్నం నగరపాలక సంస్థ పరిధిలో ప్రజలు ఎదుర్కొంటున్న తాగునీటి ఇబ్బందులపై దష్టి కేంద్రీకరించి పరిష్కారానికి కృషిచేస్తానని రాష్ట్ర రవాణా, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) పేర్కొన్నారు. మచిలీపట్నం మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలోని పంపుల చెరువు హెడ్‌ వాటర్‌ వర్క్స్‌ నుండి శారదానగర్‌ లోని ఓవర్‌ హెడ్‌ ట్యాంక్‌ వరకు రూ.1.50 కోట్లతో రెండున్నర కిలోమీటర్ల దూరం కొనసాగే తాగునీటి పైప్‌ లైన్‌ నిర్మాణ పనులకు గురువారం ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ స్థానిక శారదానగర్‌ ప్రాంతంలో మున్సిపల్‌ ట్యాంకర్లతో నీటి సరఫరా మినహా కుళాయి ద్వారా నీరు లభ్యమయ్యేవి కాదన్నారు. ఎంతోకాలంగా తాగునీటి ఇక్కట్లు ఆ ప్రాంతంలో అత్యధికమమన్నారు. ఆ తర్వాత కీర్తిశేషులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి హయాంలోనే ఓవర్‌ హెడ్‌ ట్యాంక్‌ శారదానగర్‌లో మంజూరైందన్నారు. పంపుల చెరువు నుంచి నాటి పైప్‌ లైన్‌ పాతది కావడం , వ్యాసార్థం చిన్నగా ఉండటం శారదానగర్‌ ఓవర్‌ హెడ్‌ ట్యాంక్‌ను తాగునీటితో నింపేందుకు అత్యధిక సమయం పడుతోందన్నారు. ఇటీవల ప్రభుత్వం విడుదల చేసిన రూ.45 కోట్ల తాగునీటి పథకంలో భాగంగా టైలర్స్‌ కాలనీ, ఖాలేఖాన్‌ పేటల్లో నూతన ఓవర్‌ హెడ్‌ రిజర్వాయర్లు త్వరలో నిర్మాణం కానున్నాయన్నారు. వాటిని సైతం నీటితో నింపడానికి , శారదా నగర్‌ ఓవర్‌ హెడ్‌ ట్యాంక్‌ను వేగంగా నింపడానికి ఈ రెండున్నర కిలోమీటర్ల ప్రత్యేక పైప్‌ లైన్‌ నిర్మాణం అత్యవసరమన్నారు. గత కొంతకాలంగా శారదానగర్‌ , టైలర్స్‌ కాలనీ, ఖాలేఖాన్‌ పేట , శివగంగ ప్రాంత ప్రజలు పడుతున్న తాగునీటి ఇబ్బంది తొలిగిపోనున్నట్లు మంత్రి పేర్ని నాని తెలిపారు. ఈ సమస్య పరిష్కారం కోసం నిధులు మంజూరు చేసిన ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి, రాష్ట్ర పురపాలక, పట్టణాభివద్ధి శాఖ మంత్రి బొత్స సత్యన్నారాయణలకు కతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మచిలీపట్నం నగరపాలక సంస్థ మేయర్‌ మోకా వెంకటేశ్వరమ్మ, డిప్యూటీ మేయర్లు లంకా సూరిబాబు, తంటిపూడి కవిత, మచిలీపట్నం మార్కెట్‌ యార్డ్‌ ఛైర్మెన్‌ షేక్‌ ముస్తఫా (అచ్చాబా ), కార్పొరేటర్లు చిటికెన నాగేశ్వరరావు, మహమ్మద్‌ రఫీ, షేక్‌ సాహెబ్‌, నాలి శారద, మచిలీపట్నం నగర పాలక సంస్థ కమీషనర్‌ శివరామకష్ణ, డివిజన్‌ ఇంచార్జ్‌ లు బందెల థామస్‌ నోబుల్‌, నాలి మాధవ్‌, ఎం ఇ త్రినాధ్‌ రావు, ఏ ఇ వర ప్రసాద్‌, పిల్లి ప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.