Feb 12,2021 00:09

వాటర్‌ సప్లై ఎఇ కనకరాజుకు వినతి పత్రం ఇస్తున్న సిపిఎం నాయకులు

ప్రజాశక్తి-ములగాడ
జీవీఎంసీ 63వ వార్డు పరిధి కాకర్లోవ ప్రాంతంలో తాగునీటి సమస్యను పరిష్కరించాలని కోరుతూ సిపిఎం ఆధ్వర్యాన ప్రజలు ఎఇ జి.కనకరాజుకు గురువారం వినతిపత్రం అందించారు. 60 కుటుంబాలకు తాగు నీరు లేక చాలా ఇబ్బందులు పడుతున్నారని, కొండపైకి వచ్చే పైప్‌లైన్‌ లీకులు కావడంతో ప్రెజర్‌ తగ్గి నీరు రాక ప్రజలు చాలా ఇబ్బందులకు గురవుతున్నారని వివరించారు. మూడు బిందెలు కంటె నీరు ఎక్కువ రావడంలేదని తెలిపారు. తక్షణమే పైపులైనుకు మరమ్మతులు చేయాలని, కొండపైకి పైపులైన్‌ వేయాలని సిపిఎం 63వ వార్డు కార్యదర్శి కె.పెంటారావు కోరారు. దీనికి ఎఇ కనకరాజు స్పందిస్తూ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కారానికి కృషిచేస్తానని హామీ ఇచ్చారు. వినతి పత్రం ఇచ్పినవారిలో సిపిఎం మల్కాపురం జోన్‌ కార్యదర్శి ఆర్‌.లక్ష్మణమూర్తి, ఏరియా నాయుకులు బిఎస్‌ఆర్‌.మూర్తి ఎ.రమణ, పవన్‌ పాల్గొన్నారు.