Oct 14,2021 15:52

తైవాన్‌ : దక్షిణ తైవాన్‌లో ఓ భవనంలో జరిగిన భారీ అగ్ని ప్రమాదంలో 46 మంది చనిపోగా..అనేక మందికి గాయాలయ్యాయి. 13 అంతస్తుల భవనంలో గురువారం తెల్లవారు జామున 3 గంటలకు ఈ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. అక్కడిక్కడే 11 మంది సజీవ దహనం కాగా, ఈ ప్రమాదంలో 55 మందిని ఆసుపత్రికి తరలించగా... వీరిలో 14 మంది మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. ఈ ప్రమాదం జరిగిన వెంటనే అగ్ని మాపక సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపడుతున్నారు. ఈ మంటలు భవనంలోని పలు అంతస్తులకు వ్యాపించాయని అగ్ని మాపక సిబ్బంది తెలిపారు. ఈ మంటలకు గల కారణాలను అధికారులు సరిగ్గా చెప్పలేకపోయారు. మొత్తంగా ఈ ప్రమాదంలో 40 మందికి పైగా మరణించారని ఫైర్‌ చీఫ్‌ లీ చింగ్‌-సియు తెలిపారు.