Nov 27,2020 22:10

రెడీమేడ్‌ షోరూమ్‌ను ప్రారంభిస్తున్న మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్ధన్‌ రెడ్డి

- మాజీ ఎమ్మెల్యే బీసీ
ప్రజాశక్తి - బనగానపల్లె:
 యువత స్వయం ఉపాధితో ఆర్థిక అభివృద్ధి సాధించాలని మాజీ ఎమ్మెల్యే బీసీ.జనార్ధన్‌ రెడ్డి ఆకాంక్షించారు. శుక్రవారం పట్టణంలోని కెఎం బ్రాండ్‌ హౌస్‌ రెడీమేడ్‌ షో రూమ్‌ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. యువత ఉన్నత చదువులు చదువుకొని ఉద్యోగాలు రాలేదని నిరాశ పడకుండా స్వయం ఉపాధితో ఆర్థిక అభివృద్ధి సాధించాలని తెలిపారు. యువత, నిరుద్యోగులు చిన్న చిన్న వ్యాపారాలను, షాపులను ఏర్పాటు చేసుకుని ఆర్థికంగా అభివద్ధి సాధించాలని చెప్పారు. టిడిపి మైనార్టీ సెల్‌ జిల్లా అధ్యక్షులు అత్తార్‌ జావేద్‌ హుస్సేన్‌, అల్తాఫ్‌ హుస్సేన్‌, రాయలసీమ సలాం, టిప్‌ టాప్‌ కలాం పాల్గొన్నారు.