
ముంబయి : ముకేష్ అంబానీ నేతఅత్వంలోని రిలయన్స్ ఇండిస్టీస్ (రిల్) తన ఆయిల్-టు-కెమికల్స్ (ఒటుసి) వ్యాపారాన్ని స్వతంత్ర అనుబంధ సంస్థగా రూపొందిస్తున్నట్లు మంగళవారం ప్రకటించింది. వ్యాపార బదిలీతో కొత్తగా ఏర్పడిన ఈ అనుబంధ సంస్థపై 100 శాతం నిర్వహణ, నియంత్రణ కలిగి ఉంటుందని రిలయన్స్ వెల్లడించింది. పునర్వ్యవస్థీకరణ తర్వాత ప్రమోటర్ గ్రూప్ ఒటుసి వ్యాపారంలో 49.14 శాతం వాటాను కలిగి ఉంటుందని పేర్కొంది. ఈ ప్రక్రియతో కంపెనీ వాటాదారుల్లో ఎలాంటి మార్పు ఉండదని వెల్లడించింది. దీనికి ఇప్పటికే సెబీ ఆమోదం కూడా లభించింది.