Nov 26,2021 07:36
  • సిపిఎంతో పాటు పలువురు నాయకులు నివాళి

ప్రజాశక్తి - పాములపాడు : కర్నూలు జిల్లా పాములపాడు మండలం కృష్ణరావుపేట గ్రామానికి చెందిన స్వాతంత్ర సమరయోధుడు, రిటైర్డ్‌ హిందీ ఉపాధ్యాయులు బత్తిని అనంత రామయ్య(103) బుధవారం రాత్రి మరణించారు. వయోభారంతో స్వగ్రామంలోనే కన్ను మూశారు. ఆయనకు ఐదుగురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నాడు. అనంతరామయ్య మరణవార్త తెలుసుకున్న సిపిఎం తూర్పుజిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఎ.రాజశేఖర్‌, జిల్లా నాయకులు బి.రామేశ్వరరావు, సి.హనుమంతుతో పాటు పలువురు నాయకులు నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. అనంత రామయ్య సహాయ నిరాకరణ ఉద్యమం, జాతీయోద్య మంలో పాల్గొన్నారని తెలిపారు. ఉమ్మడి కమ్యూనిస్టు పార్టీలోనూ పనిచేశారని తెలిపారు. పాములపాడు జెడ్‌పి హైస్కూల్‌లో హిందీ ఉపాధ్యాయులుగా పని చేశారని, సంగీతం, నాటకాలు, కళారంగంలో నైపుణ్యం కలవారని, పేద ప్రజలకు హోమియో వైద్యం అందించారని తెలిపారు. గురువారం సాయంత్రం రామయ్య అంత్యక్రియలు పూర్తి చేసినట్లు కుటుంబసభ్యులు తెలిపారు.