Jan 21,2021 18:55

ఢిల్లీ: ఎపి పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో హైకోర్టు ఇచ్చిన తీర్పుపై రాష్ట్రప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. ముఖ్యంగా వ్యాక్సినేషన్‌ సమయంలో ఎన్నికల నిర్వహణ కష్టమని, హైకోర్టు ఆదేశాలను రద్దు చేయాలని అందులో పేర్కొంది. ఎస్‌ఈసీ అప్పీల్‌పై హైకోర్టులో రెండురోజుల పాటు విచారణ జరిగింది. అనంతరం తీర్పును కోర్టు రిజర్వ్‌ చేసింది. ఈ క్రమంలోనే గురువారం ఉదయం హైకోర్టు తీర్పును వెలువరించింది. పంచాయతీ ఎన్నికలను నిర్వహించాలని ఆదేశించింది. ఎన్నికలను ఆపేందుకు సరైన కారణాల్లేవని, ఎలాంటి ఇబ్బందీ లేకుండా ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలని ఆదేశించింది. దీంతో రాష్ట్రప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్‌ వేసింది.