Jan 15,2022 13:00

హైదరాబాద్‌ : టాలీవుడ్‌ టాప్‌ డైరెక్టర్‌ సుకుమార్‌ని బాలీవుడ్‌ హీరో తనతో ఓ సినిమా చేయమని అడిగారట. ఇంతకీ ఆ బాలీవుడ్‌ హీరో ఎవరంటే అక్షరు కుమార్‌. సుకుమార్‌ పుష్ప పార్ట్‌ -1 సినిమా గతేడాది డిసెంబర్‌ 17న విడుదలై సంచలనం సృష్టిస్తోంది. ఈ చిత్రం బాలీవుడ్‌లో కూడా భారీ కలెక్షన్ల దిశగా దూసుకుపోతోంది. ఈ క్రమంలో ఈ చిత్రాన్ని అక్షరుకుమార్‌ చూసి.. అల్లు అర్జున్‌ నటనను, సుకుమార్‌ను మెచ్చుకుంటూ ట్వీట్‌ కూడా చేశారు. ఆయన కేవలం ట్వీట్‌లో ప్రశంసించడమే కాదు.. స్వయంగా సుకుమార్‌కి ఫోన్‌ చేసి.. తనతో ఓ సినిమా చేయాలని అడిగారట. ఈ విషయాన్ని తాజాగా సుకుమార్‌ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. 'అక్షరుకుమార్‌ నాకు ఫోన్‌ చేసి మాట్లాడడం చాలా సంతోషంగా ఉంది. నాకూ బాలీవుడ్‌లోనూ సినిమా చేయాలని ఎప్పటి నుంచో ఆలోచన ఉంది. భవిష్యత్తులో బాలీవుడ్‌లో సినిమా తీస్తే.. అది కచ్చితంగా మొదటగా అక్షరుకుమార్‌ నటించే చిత్రానికే డైరెక్ట్‌ చేస్తా' అని అన్నారు. ప్రస్తుతం పుష్ప పార్ట్‌ - 1 సక్సెస్‌ను ఎంజారు చేస్తున్న సుకుమార్‌.. త్వరలోనే పుష్ప - పార్ట్‌ -2ని సెట్స్‌ మీదకు తీసుకొచ్చే సన్నాహాలలో ఉన్నారట. ఈ చిత్రంలో అల్లుఅర్జున్‌, రష్మిక మందన్న హీరో, హీరోయిన్లుగా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్‌, ముత్తం శెట్టి మీడియా కలిసి భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నాయి.