
నక్కపల్లి : విజయ దశమిని పురష్కరించుకుని సూక్ష్మ కళాకారులు తమ ప్రతిభను చాటారు. మండలంలోని చినదొడ్డిగల్లు గ్రామానికి చెందిన గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు గ్రహీత గట్టెం వెంకటేష్ పెన్సిల్ ముల్లుపై దుర్గాదేవి రూపాన్ని అవిష్కరించాడు. ఎత్తు 5 మిల్లీమీటర్లు, వెడల్పు 4 మిల్లీమీటర్లుతో రెండు గంటల సమయంలో దుర్గాదేవి రూపాన్ని చెక్కినట్లు వెంకటేష్ తెలిపాడు. అదే గ్రామానికి చెందిన సూక్ష్మ కళాకారుడు దార్ల రవి చెక్కపై దుర్గాదేవి ప్రతిమను, త్రిశూలాన్ని చెక్కాడు. ఉద్దండపురం గ్రామానికి చెందిన తుమ్మల ఫణీంద్ర సుద్ద ముక్కపై దుర్గాదేవి ముఖ ప్రతిమను ఆవిష్కరించాడు.