Sep 15,2021 20:27

న్యూఢిల్లీ : వస్తు సేవల పన్ను (జిఎస్‌టి) కౌన్సిల్‌ సమావేశం శుక్రవారం జరగనుంది. లక్నో కేంద్రంగా వర్చువల్‌ విధానంలో ఈ సమావేశానికి ఏర్పాట్లు చేశారు. కాగా పెట్రోల్‌, డీజిల్‌లను కూడా జిఎస్‌టి పరిధిలోకి తీసుకుని వచ్చే అంశాన్ని ఆర్థికమంత్రిత్వ శాఖ పరిశీలిస్తుందంటూ రిపోర్టులు వస్తోన్న నేపథ్యంలో ఈ సమావేశానికి ప్రాధాన్యత సంతరించుకుంది.