Nov 22,2020 23:35

సుధబాబుకు నివాళి అర్పిస్తున్న సిపిఎం నాయకులు

ప్రజాశక్తి- ఎటపాక : సిపిఎం నాయకుడు సుధబాబు ఆశయ సాధనకు కృషి చేస్తామని పార్టీ మండల కార్యదర్శి మర్లపాటి నాగేశ్వరరావు అన్నారు. అమరజీవి సుధబాబు ప్రథమ వర్థంతిసభ మురుమూరులో ఆయన స్మారక స్తూపం వద్ద కాకా అర్జున్‌ అధ్యక్షతన ఆదివారం నిర్వహించారు. తొలుత సిఐటియు మండల కార్యదర్శి డేగల మాధవరావు పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం పార్టీ నాయకులు సుధబాబు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా నాగేశ్వరావు మాట్లాడుతూ పార్టీ విస్తరణకు, పార్టీ అనుబంధ ప్రజా సంఘాల బలోపేతానికి సుధబాబు కషి ఎనలేనిది అన్నారు. కూలి పోరాటంలో, తునికాకు రేట్ల పోరాటంలో, పోలవరం ఉద్యమంలో సుధబాబు చురుగ్గా పాల్గొన్నారన్నారు. ఆయన మరణం పార్టీకి తీరని లోటని చెప్పారు. సుధాబాబు పై ఐవి పాట రచించి పాడారు. ఈ కార్యక్రమంలో ఐద్వా మండల కార్యదర్శి పద్మ, గిరిజన సంఘం మండల అధ్యక్షులు సొందే రామారావు, వ్యవసాయ కార్మిక సంఘం మండల కార్యదర్శి గద్దల హుస్సేన్‌, పార్టీ నాయకులు సోయం వీరమ్మ, కారం జయమ్మ, బుద్దుల భద్రయ్య, హరనాధ్‌, కందుల శ్రీను, అమరవరపు నాగేంద్ర, సోయం లక్ష్మణరావు, సోయం పెద బాబు, సవలం రాము, సుధబాబు సతీమణి, కుమారుడు రాజా పాల్గొన్నారు.