Sep 24,2021 01:44

దీక్షల్లో పాల్గొన్న మురికివాడల సంక్షేమ సంఘం సభ్యులు

ప్రజాశక్తి- కలెక్టరేట్‌
దేశ ఆర్థిక వ్యవస్థకు దన్నుగా నిలుస్తూ, వేలాది మందికి ఉద్యోగ, ఉపాధి కల్పిస్తున్న విశాఖ స్టీల్‌ ప్లాంటును అమ్మేయాలన్న నిర్ణయాన్ని ఆపాలని మురికివాడ నివాసుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు కె.రవి డిమాండ్‌ చేశారు. విశాఖ అఖిలపక్ష కార్మిక, ప్రజా సంఘాల జెఎసి ఆధ్వర్యంలో జివిఎంసి గాంధీ విగ్రహం వద్ద చేపట్టిన దీక్షలు గురువారం నాటికి 175వ రోజుకు చేరాయి. నిరాహార దీక్ష శిబిరంలో మురికివాడ నివాసుల సంక్షేమ సంఘం సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ప్రాంతం అభివద్ధిని దృష్టిలో పెట్టుకొని రైతులు వేలాది ఎకరాలు భూములు స్టీలుప్లాంట్‌కు ఇస్తే వాటిని ప్రైవేటు కార్పొరేట్‌ కంపెనీలకు ఎలా అప్పగిస్తారని ప్రశ్నించారు. స్టీల్‌ప్లాంట్‌పై పరోక్షంగా, ప్రత్యక్షంగా లక్షలాది మంది ఆధారపడి జీవిస్తున్నారని, వారి జీవనోపాధిని దెబ్బతీసే అధికారం మోడీ ప్రభుత్వానికి ఎవరిచ్చారని దుయ్యపట్టారు. భారత రాజ్యాంగం రిజర్వేషన్లు కల్పిస్తే ఇలా వాటిని అడ్డదారిలో తొలగించడం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో సంఘం కార్యదర్శి జి.లక్ష్మీనారాయణ , ఎం.లక్ష్మి, మహిళలు పాల్గొన్నారు.