Oct 27,2021 22:33

బానకచర్ల ప్రధాన రహదారిని వెడల్పు చేయించిన సర్పంచి

ప్రజాశక్తి- పాములపాడు : బానకచర్ల గ్రామం ఎంట్రెన్స్‌ నుండి చివరన ఉన్న సుంకులమ్మ గుడి వరకు ప్రధాన రహదారిని సర్పంచి ఆవుల జయసుధ, పారిశ్రామికవేత్త ఆవుల నారాయణ రెడ్డి సొంత నిధులతో వెడల్పు చేయించారు. రోడ్డు వెడల్పు గ్రామస్తులకు, వేంపెంట వెలుగోడు మీద వెళ్లే నంద్యాల ప్రయాణికులకు ఎంతో సౌకర్యంగా ఉంటుందని గ్రామస్తులు, ప్రయాణికులు హర్షం వ్యక్తం చేశారు. నెల రోజుల కిందట తన సొంత నిధులతో అధ్వాన్నంగా ఉన్న భానుముక్కల మలుపు నుండి భానకచర్ల రోడ్డును సర్పంచి బాగు చేయించారు. రోడ్లు, నీటి సమస్య, స్కూల్లో మరమ్మతులకు విరాళం, నిరుపేదలకు నిత్యవసర వస్తువులు, దుస్తులు తదితర పంపిణీ కార్యక్రమాలతో ముందుకు సాగుతున్న సర్పంచి ఆవుల జయసుధ, నారాయణ రెడ్డి కుటుంబానికి గ్రామస్తులు ధన్యవాదాలు తెలియజేశారు.