Jun 11,2021 11:19

వికారాబాద్‌ (తెలంగాణ) : వికారాబాద్‌ జిల్లా చింతపల్లి వద్ద వైఎస్‌ఆర్‌టిపి అధ్యక్షురాలు షర్మిల కాన్వాయ్ను పోలీసులు అడ్డుకున్నారు. శుక్రవారం ఉదయం లోటస్‌పాండ్‌ నుంచి షర్మిల పరిగికి బయలుదేరారు. కోవిడ్‌ నేపథ్యంలో... షర్మిల కాన్వాయ్లో రెండు వాహనాలకే పోలీసుల అనుమతి లభించింది. దీంతో కాన్వాయ్లోని ఇతర వాహనాలను చింతపల్లి దగ్గర పోలీసులు ఆపేశారు. కాసేపు పోలీసులకు, వైఎస్సార్‌టిపి నేతలకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. మరికాసేపట్లో దోమ మండలం పాలెపల్లికి షర్మిల చేరుకోనున్నారు. ప్రతిపక్షాల అసత్య ప్రచారం తిప్పికొడతామంటూ.. దోమ మండలం టిఆర్‌ఎస్‌ శ్రేణులు ప్రకటన చేశాయి. ఈ నేపథ్యంలో.. పాలెపల్లి ఐకెపి సెంటర్‌ వద్ద పోలీసులు భారీగా మోహరించారు.