Nov 21,2020 20:44

హైదరాబాద్ : మహేశ్‌బాబు హీరోగా మైత్రీ మూవీ మేకర్స్‌, జీఎంబి ఎంటర్టైన్మెంట్‌, 14 రీల్స్‌ ప్లస్‌ బ్యానర్స్‌పై పరశురామ్‌ దర్శకత్వంలో వీన్‌ యెర్నేని, వై రవిశంకర్‌, రామ్‌ ఆచంట, గోపి ఆచంట నిర్మిస్తున్న సినిమా 'సర్కారు వారి పాట'. ఈ సినిమా శనివారం ఉదయం లాంఛనంగా ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి సితార ఘట్టమనేని క్లాప్‌ కొట్టగా, నమ్రత కెమెరా స్విచ్‌ ఆన్‌ చేశారు. నిర్మాతలు స్క్రిప్ట్‌ను దర్శకుడు పరుశురాంకు అందించారు. ఈ కాంబినేషన్‌పై ప్రేక్షకాభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే విడుదలైన మోషన్‌ పోస్టర్‌ అందరినీ ఆకట్టుకుంటుంది. కీర్తిసురేశ్‌ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమా రెగ్యులర్‌ షూటింగ్‌ జనవరి మొదటివారం నుంచి ప్రారంభమవుతుంది.