Nov 26,2021 07:23
  • ఏపి, తెలంగాణాలకు కేఆర్‌ఎంబి లేఖ

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : శ్రీశైలం డ్యామ్‌, నాగార్జున సాగర్‌లలో విద్యుత్‌ ఉత్పత్తిని పూర్తిగా నిలిపివేయాలని కేఆర్‌ఎంబీ బోర్డు రెందు రాష్ట్ర ప్రభుత్వాలకు లేఖ రాసింది. సాగు,తాగునీటి అవసరాల కోసం కాకుండా విధ్యుత్‌ ఉత్పత్తి కోసం నీటిని వాడొద్దని గురువారంనాడు ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణా ప్రభుత్వాలకు లేఖ రాసింది. రెండు రాష్ట్రాలు విద్యుత్‌ ఉత్పత్తిని చేయడంతో శ్రీశైలంలో నీటి మట్టం బాగా తగ్గిపోతోందని,భవిష్యత్‌లో తాగునీటికి కూడా ఇబ్బందులు వచ్చే అవకాశం వుందని పేర్కొంది. ఇప్పటికే కృష్ణా జలాలు వృధాగా సముద్రంలోకి పోతున్నాయని పేర్కొంది.