Mar 02,2021 14:33

శ్రీకాకుళం: సిక్కింలో జరిగిన ఆర్మీ వాహన ప్రమాదంలో నగరానికి చెందిన సైనికోద్యోగి మఅతి చెందారు. ఇల్సిపురం నివాసి వంజరాపు రామారావు (36) విధులు నిర్వర్తిస్తున్న సమయంలో మంచు కారణంగా వాహనం ఒక్కసారి లోయలోకి పడిపోయింది. ఘటనా స్థలంలోనే రామారావుతో పాటు మరో ఆర్మీ సైనికుడు మృతిచెందాడు. మరో ముగ్గురు తృటిలో తప్పించుకున్నారు. ఈ ఘటన సోమవారం చోటు చేసుకుంది. మృతదేహాలను ఆర్మీ సిబ్బంది మంగళవారం వెలికితీశారు. సమాచారం తెలుసుకున్న కుటుంబ సభ్యులు బోరున విలపిస్తున్నారు. మృతునికి భార్యా, ఇద్దరు పిల్లలున్నారు. రామారావు మృతి పట్ల స్నేహితులు, బంధువులు తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నారు.