
పార్వతీపురం : స్పందన కార్యక్రమానికి వచ్చే వినతులను తక్షణమే పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని ఐటిడిఎ పిఒ ఆర్.కూర్మనాథ్.. అధికారులను ఆదేశించారు. సోమవారం ఐటిడిఎ గిరిమిత్ర సమావేశ మందిరంలో టెలీ స్పందన కార్యక్రమాన్ని ఆయన నిర్వహించారు, సబ్ ప్లాన్ మండలాల్లోని ప్రజల నుంచి విశేష స్పందన వ్యక్తమైంది. వివిధ సమస్యలపై వినతులు అందాయి. వినతులను పిఒ పరిశీలించి, పరిష్కారం నిమిత్తం సంబంధిత శాఖలకు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎపిఒ సురేష్ కుమార్, గిరిజన సంక్షేమ శాఖ డిడి కిరణ్ కుమార్, ఇఇ శాంతేశ్వరరావు, డిప్యూటీ డిఇఒ మోహనరాయుడు, పిహెచ్ఒ చిట్టిబాబు, ఎపిడి సత్యనారాయణ పాల్గొన్నారు.
సమయపాలన పాటించాలి
సచివాలయ సిబ్బంది సమయపాలన పాటించాలని ఐటిడిఎ పిఒ కూర్మనాథ్ ఆదేశించారు. కొత్త బెలగాం 1, 2 వార్డు సచివాలయాలను ఆయన సందర్శించారు. సచివాలయంలో అందిస్తున్న సేవలపై ఆరా తీశారు. సంక్షేమ పథకాల అమలులో ప్రభుత్వ ఆదేశాలను, నియమాలను అందరూ తప్పకుండా ఆనుసరించాలని, సేవల్లో పారదర్శకత పాటించాలని సిబ్బందికి సూచించారు. ఫిర్యాదుల పరిష్కారంలో అలసత్వం ప్రదర్శించవద్దని సూచించారు. వాలంటరీ వ్యవస్థను సక్రమంగా వినియోగించు కోవాలని కోరారు.