
సోనూ సూద్, ఒకేషనల్ ట్రైనింగ్ అందించే 'స్కూల్నెట్'తో కలిసి 2020 జులైలో 'ప్రవాసి రోజ్గార్' ఎంప్లాయిమెంట్ పోర్టల్ని ప్రారంభించారు. వలస కార్మికులకు ఉపాధి కల్పించే ఉద్దేశంతో ఈ పోర్టల్ని ప్రారంభించారు. దీనిని లాంచ్ చేసిన నాలుగు నెలల వ్యవధిలోనే దాదాపు 10 లక్షల మంది ఉద్యోగార్థులు దీనిలో తమ వివరాలు నమోదు చేసుకున్నారు. ఈ సందర్భంగా 'లక్షలాది మంది యువతకు మంచి జీవనోపాధి, భవిష్యత్తు అందించాలనే నా కల ఈ పార్టనర్షిప్ ద్వారా నెరవేరనుంది. లక్షలాది మంది వలస కార్మికులకు దీని ద్వారా ఉపాధి అవకాశాలను కల్పించడమే కాక నైపుణ్యాభివద్ధి శిక్షణ కూడా ఇవ్వనున్నాం' అని తెలిపారు.