Nov 28,2020 08:54

మొగాదీషు : సోమాలియా దేశంలోని మొగాదీషు అంతర్జాతీయ విమానాశ్రయానికి సమీపంలో ఆత్మహుతి దాడి జరిగింది. ఈ దాడిలో ఏడుగురు మరణించారని పోలీసులు తెలిపారు. 10 మందికి పైగా గాయపడ్డారని చెప్పారు. ఈ మృతుల్లో ఇథియోపియన్‌ రాయబార కార్యాలయ ఉద్యోగి కూడా ఉన్నట్లు తెలుస్తోంది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశాలున్నాయని పోలీస్‌ అధికారి మహ్మద్‌ దహిర్‌ తెలిపారు. విమానాశ్రయంలోని చెక్‌ పాయింట్‌ వద్ద ఉన్న ఐస్‌ క్రీం పార్లర్‌ సమీపంలో సెక్యూరిటీ, ఇంటెలిజన్స్‌ ఉన్నతాధికారులు లక్ష్యంగా చేసుకుని ఆత్మాహుతి దాడి చోటుచేసుకుందన్నారు.