Oct 28,2021 18:27

అన్నదానం చేస్తున్న ఎమ్మెల్యే

ప్రజాశక్తి-శ్రీకాళహస్తి
పర్వదినాలు హిందూ ముస్లిం మధ్య సోదరభావాన్ని పెంపొందించేందుకు దోహదపడాలని ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్‌రెడ్డి అన్నారు. పట్టణంలోని మసీదువీధిలో మహబూబ్‌సుభాని జెండా వద్ద మిలాద్‌ ఉన్‌ నబీ నిర్వహించారు. అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే పూజాధికార్యక్రమాల్లో పాలుపంచుకున్నారు. సుమారు వెయ్యిమంది పేదలకు అన్నదానం చేశారు. మతపెద్దలు పాల్గొన్నారు.