Jan 13,2021 22:47

గుంతల బడిన రహదారిని చదును చేసిన దివాకర్‌ రెడ్డి

ప్రజాశక్తి - చిప్పగిరి: మండలంలోని కుందనకుర్తి గ్రామంలో మెయిన్‌ రహదారి అంతా గుంతలు ఏర్పడి మనుషులు నడవడానికి, వాహనాలు నడపడానికి ఇబ్బందులు పడేవారు. ఈ పరిస్థితిని గమనించిన కుందన కుర్తి గ్రామ నివాసి దివాకర్‌ రెడ్డి సొంత డబ్బులు ఖర్చు పెట్టి జెసిబి ద్వారా రహదారి అంతా చదును చేయించి మట్టి గరసును వేయించారు. బుధవారం ఆయన మాట్లాడారు. అధికారులు మెయిన్‌ రహదారిలో మురికి నీరు చల్లకుండా చూడాలన్నారు. అలాగే రహదారిలోకి కట్టడాలు కట్టారని, వాటిని సరిచేసి వాహనాలు వెళ్లేవిధంగా ఏర్పాటు చేయాలని కోరారు. గ్రామ పెద్దలు నాగప్ప, కొండ శేఖర్‌, తిప్పయ్య పాల్గొన్నారు.