Mar 02,2021 23:04

ప్రచారం నిర్వహిస్తున్న మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి

ప్రజాశక్తి-చీమకుర్తి: చీమకుర్తి నగర పంచాయతీ ఎన్నికలలో వైసిపి అభ్యర్థులను గెలిపించి అభివృద్ధికి బాటలు వేయాలని మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాదరెడ్డి కోరారు. 9వ వార్డు వైసిపి అభ్యర్థి కంజుల ప్రతాపరెడ్డికి మద్దతుగా బూచేపల్లి మంగళ వారం ఇంటింటి ప్రచారం చేశారు.ఈ సందర్భంగా ఆయన మాటా ్లడుతూ ముఖ్యమంత్రి జగన్మోనరెడ్డి ప్రవేశపెట్టిన ప్రజాసంక్షేమ పథకాలే మున్సిపల్‌ ఎన్నికలల్లో విజయాన్ని చేకూరు స్తాయన్నారు. ఎన్నికల్లో 20 వార్డులను వైసిపి కైవసం చేసుకుటుందన్నారు. ఈ కార్యక్ర మంలో వైసిపి మండల అధ్యక్షులు దాసరి లక్ష్మినారాయణ, పట్టణ అధ్యక్షులు క్రిష్టిపాటి శేఖరరెడ్డి, పట్టణ యూత్‌ అధ్యక్షులు మొగిలిశెట్టి వెంకటేశ్వర్లు, వైసిపి అభ్యర్థి కంజుల ప్రతాపరెడ్డి, బడే అయ్యపురెడ్డి, కంజులరామిరెడ్డి, కురుగుంట్ల వెంకారెడ్డి, సుంకర రమణారెడ్డి పాల్గొన్నారు.