Jan 14,2022 19:36

సంక్రాంతి వచ్చింది
భోగి మంటలతో
చీకటినే తరిమంది

సంక్రాంతి వచ్చింది
కొత్త బట్టలతో
సంబరాలు ఇచ్చింది

సంక్రాంతి వచ్చింది
పిండి వంటలతో
వేడుకలే చేసింది

సంక్రాంతి వచ్చింది
రంగుల పతంగులతో
సందడినే తెచ్చింది

సంక్రాంతి వచ్చింది
ముత్యాల ముగ్గులతో
ఆనందాన్ని ఇచ్చింది

సంక్రాంతి వచ్చింది
భోగ భాగ్యాలతో
పండుగనే చేసింది

- కయ్యూరు బాలసుబ్రమణ్యం
94417 91239