Nov 30,2020 00:34

ఒకేచోట కలుసుకున్న పూర్వ విద్యార్థులు

పరవాడ : మండలంలోని రావాడ పంచాయతీ పరిధి ధర్మరాయుడుపేట జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో 2006లో పదో తరగతిని అభ్య సించిన విద్యార్థులంతా ఆదివారం తలుపులమ్మ లోవలో కలుసుకున్నారు. ఈ ఆత్మీయ కలయిక సందడి వాతావరణం నడుమ సాగింది. 14 ఏళ్ల తరువాత అందరూ ఒకేచోట కలుసుకోవడం వల్ల వారి ఆనందానికి హద్దులు లేకుండా పోయాయి. ఒకరినొకరు ఆలింగనం చేసుకుని యోగక్షేమాలు కనుక్కున్నారు. నాటి గురుతులను మననం చేసుకున్నారు. ప్రతి ఏడాదీ ఇదే విధంగా కలుసుకుని పేద విద్యార్థులకు ఆర్థిక తోడ్పాటు, సహాయ సహకారాలు అందించాలని నిర్ణయించుకున్నారు. పూర్వ విద్యార్థులంతా కలుసుకోవడానికి కృషి చేసిన నరేష్‌, వెంకటేష్‌, లోవకుమార్‌, గణేష్‌లను అభినందించారు.