Nov 27,2020 11:31

ఢిల్లీ: భారత నౌకాదళానిక చెందిన మిగ్‌-29కే శిక్షణ విమానం సముద్రంలో కుప్పకూలింది. శిక్షణలో భాగంగా అరేబియా సముద్రంపై ప్రయాణిస్తుండగా ప్రమాదవశాత్తూ ఎయిర్‌క్రాఫ్ట్‌ కూలిపోయింది. ఈ ఘటన గురువారం సాయంత్రం చోటుచేసుకున్నట్లు నేవీ అధికారులు శుక్రవారం వెల్లడించారు. ఘటన సమయంలో విమానంలో ఇద్దరు పైలట్లకుగానూ ఒక పైలట్‌ను కాపాడామని, మరో పెలట్‌ గల్లంతయ్యారని తెలిపారు. అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు. ప్రమాదంపై ఉన్నతస్థాయి దర్యాప్తుకు ఆదేశించినట్లు నేవీ అధికారులు తెలిపారు.