
ప్రజాశక్తి - పెనుమంట్ర
గ్రామంలో సమస్యలుంటే తప్పకుండా తమ దృష్టికి తీసుకొస్తే సత్వరమే పరిష్కరిస్తామని పెనుమంట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు అన్నారు. సోమవారం పెనుమంట్ర పంచాయితీ కార్యాలయం వద్ద జరిగిన గ్రామ పంచాయతీ అభివృద్ధి ప్రణాళిక (జిపిడిపి)పై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ ఎస్సి కాలనీలో డ్రెయినేజీ సమస్యను పరిష్కరిస్తామన్నారు. రజకపేటలో విద్యుత్ మరమ్మతులు, బోదె పూడిక పనులు పూర్తి చేశామని తెలిపారు. ఎస్సి, బిసి ఏరియాలో వాటర్ టాంక్ల నిర్మాణాలు, ఓహెచ్‌ఆర్ టాంక్ నిర్మాణాలకు సంబంధించిన ప్రణాళికను సిద్ధం చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపిడిఒ ఆఫీస్ సూపరింటెండెంట్ భాస్కరరావు, పెనుగొండ ఎఎంసి డైరెక్టర్ గాదిరాజు వెంకట సాయి రామరాజు, వైసిపి నాయకులు భూపతి రాజు వెంకట శ్రీనివాసరాజు, తేతలి సుధీర్‌రెడ్డి పాల్గొన్నారు.