Nov 30,2020 21:31

వినతిపత్రం అందజేస్తున్న నాయకులు

ప్రజాశక్తి -పెనుకొండ : పట్టణంలోని తారు రోడ్లకు మరమ్మతులు చేపట్టాలని సిపిఎం నాయకులు కోరారు. ఈమేరకు వారు తమ డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని తహశీల్దార్‌ నాగరాజుకు అందజేశారు. ఈసందర్భంగా నాయకులు మాట్లాడుతూ పట్టణంలోని ఎన్టీఆర్‌ విగ్రహం దగ్గర, ఆర్టీసీ బస్టాండ్‌, చర్చి, మడకశిర రోడ్డు, సుంకులమ్మ గుడి దగ్గర అనేక ప్రాంతాలలో పెద్ద పెద్ద గుంతలు ఉన్నాయన్నారు. అధికారులు వెంటనే స్పందించి తారు రోడ్లుకు మరమ్మతులు చేపట్టాలని కోరారు.
పట్టణంలో సిసి కెమెరాలు ఏర్పాటు చేయాలి : పట్టణంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని సిపిఎం నాయకులు కోరారు. ఈ మేరకు వారు సోమవారం స్థానిక డీఎస్పీ వంశీధర్‌ గౌడ్‌కు వినతిపత్రాన్ని సమర్పించారు. ఈసందర్భంగా నాయకులు మాట్లాడుతూ పట్టణంలో పలు చోట్ల ప్రమాదాలు, చోరీలు జరుగుతున్నాయన్నారు. సీసీ కెమెరాలు లేకపోవడంతోగుర్తించలేని పరిస్థితి ఉందన్నారు. కియో పోలీస్‌ స్టేషన్‌కు ఎస్‌ఐను నియమించాలని కోరారు.ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి రమేష్‌,సిఐటియు మండల కార్యదర్శి బాబావలి, తిప్పన్న,మూర్తి తదితరులు పాల్గొన్నారు.