Nov 13,2020 22:31

పోస్టర్‌ ఆవిష్కరిస్తున్న నాయకులు

గుంటూరు : ఉద్యోగులు, ఉపాధ్యాయుల సమస్యలపై ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించకపోతే ఉద్యమిస్తామని యుటిఎఫ్‌ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు పి.ప్రేమ్‌కుమార్‌, కె.నాగమల్లేశ్వరరావు పేర్కొన్నారు.శుక్రవారం బ్రాడీపేటలోని యుటిఎఫ్‌ కార్యాలయంలో వారు విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ పెండింగ్‌ బిల్లులు, డిఎలు, పిఆర్‌సి వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. నిత్యావసరాల ధరలు విపరీతంగా పెరిగిన నేపథ్యంలో పిఆర్‌సి అమలు చేయకపోగా మూడు డిఎలుగా కూడా పెండింగ్‌లో ఉంచటం దారుణమన్నారు. ఇప్పటికే అనేక సార్లు ప్రభుత్వానికి, అధికారులకు విన్నవించామని, స్పందించకపోతే తీవ్ర స్థాయిలో ఉద్యమానికి సిద్ధంగా ఉన్నామని హెచ్చరించారు. ఈ సందర్భంగా డిమాండ్లతో కూడిన పోస్టర్‌ను ఆవిష్కరించారు. సమావేశంలో జిల్లా నాయకులు బి.ఆదిలక్ష్మి, ఎన్‌.సుందరరావు, యం.కళాధర్‌, యం.హనుమంతరావు, ఎండి.షకీలాబేగం, జి.వెంకటేశ్వర్లు, ఎండి.గౌస్‌ పాల్గొన్నారు.