Nov 29,2020 22:41

ఎంపీని కలిసిన నవోదయ సిబ్బంది

ప్రజాశక్తి- పెద్దాపురం 'తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ నవోదయ ప్రిన్సిపల్‌ జంధ్యాల వెంకటరమణ ఆధ్వర్యంలో సిబ్బంది కాకినాడ ఎంపీ వంగా గీతను కలిసి సమస్యలు వివరించారు.' నవోదయ విద్యాలయ సాధించిన ప్రగతిని, సమస్యలను వివరించారు. దీనిపై ఎంపీ స్పందిస్తూ నూతనంగా నిర్మించిన భవన ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరవుతానన్నారు. అవసరమైన రోడ్ల మరమ్మతులు, క్రీడా మైదానం అభివృద్ధికీ, స్టేడియం నిర్మాణానికీ ప్రత్యేక శ్రద్ధ తీసుకుని కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈకార్యక్రమంలో ఇంజినీర్‌ సాల్మన్‌రాజు పాల్గొన్నారు.