Oct 28,2021 17:01

మోహిత్‌ రెడ్డిని సత్కరిస్తున్న పంచాయతీ యూనియన్‌ నాయకులు, సర్పంచ్‌ కస్తూరి

ప్రజాశక్తి - పాకాల : ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ నెలలు తరబడి తిరిగే అవసరం లేకుండా తమ సమస్యలను గ్రామ వాలంటరీల ద్వారా పరిష్కరించుకునేలా సచివాలయాలు ఏర్పాటు చేయడం హర్షించ దగ్గ విషయమని చంద్రగిరి ఎమ్మెల్యే తనయుడు చెవిరెడ్డి మోహిత్‌ రెడ్డి అన్నారు. మండలంలో పంచాయతీ బాట గురువారం ముగింపు కార్యక్రమంలో చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌ రెడ్డి తనయుడు తిరుపతి రూరల్‌ ఎంపీపీ చెవిరెడ్డి మోహిత్‌ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కులమతాలకు అతీతంగా అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందిస్తోన్న పార్టీ వైఎస్‌ఆర్‌ సీపీ పార్టీ అని అన్నారు. పంచాయతీ బాట ముగింపు రోజు సందర్భంగా సామిరెడ్డిపల్లి, పాకాల, పంటపల్లి పంచాయతీల్లో నాలుగో రోజు పంచాయతీ బాట కార్యక్రమాన్ని పాకాల జడ్పిటిసి నంగా పద్మజా రెడ్డి, వైస్‌ ఎంపీపీ చెన్నకేశవ రెడ్డి, ఎంపీపీ లోకనాథం లతో కలిసి నిర్వహించారమని అన్నారు. పాకాల ఆర్టీసీ బస్టాండ్‌ సమీపంలో ఉన్న వైఎస్‌ఆర్‌ విగ్రహానికి పూలమాల వేసి చిత్తూరు రోడ్డు కూడలి వరకు ర్యాలీ నిర్వహించామని అన్నారు. డ్వాక్రా మహిళలకు వైఎస్‌ఆర్‌ ఆసరా పథకం కింద రెండో విడత మండలంలో 1152 మహిళా సంఘాలకు 10 కోట్ల 53 లక్షల రూపాయలు మహిళల వ్యక్తిగత ఖాతాల్లోకి జమ కావడం జరిగిందని అన్నారు. పస్తుత సమాజంలో మహిళలు కూడా అన్ని రంగాల్లో ముందుండాలని ఆకాంక్షిస్తూ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న అనేక పథకాలలో మహిళలే ముఖ్య పాత్రను పోషించేలా ప్రభుత్వం వ్యవహరిస్తోందని అన్నారు. వైఎస్‌ఆర్‌ సీపీ సేవాదళ్‌ కార్యదర్శి నంగా బాబురెడ్డి, మాజీ ఎమ్మెల్యే జయదేవ నాయుడు,వైఎస్‌ఆర్‌ సీపీ నాయకులు కపిల్‌ రెడ్డి,రమేష్‌, నరేష్‌ రెడ్డి, శ్రీరాములు రెడ్డి,యుగంధర్‌ చౌదరి, యోగానంద చౌదరి,సునీల్‌ రెడ్డి, కో-ఆప్షన్‌ మెంబర్‌ కాజా మస్తాన్‌,స్టేట్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ డైరెక్టర్‌ విక్రమ్‌ రెడ్డి, బీసీ కార్పొరేషన్‌ స్టేట్‌ డైరెక్టర్‌ రఘుపతి,శ్రీ వల్లీ దేవసేన సుబ్రహ్మణ్య స్వామి ఆలయ కమిటీ చైర్మన్‌ మునిరత్నం రెడ్డి,ఏఎంసీ చైర్మన్‌ మునీర్‌, ఎంపీటీసీలు, సర్పంచులు,వార్డు మెంబర్లు, అధికారులు, ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలు, మహిళలు, ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.