Mar 05,2021 19:05

mpdo ku satkaram

సమష్టి కృషితోనే ఎన్నికలు విజయవంతం : అధికారులు
ప్రజాశక్తి-గన్నవరం
సమష్టి కృషితోనే గ్రామ పంచాయతీ ఎన్నికలను విజయవంతం చేయగలిగామని పలువురు మండల స్థాయి అధికారులు తెలిపారు. గ్రామ పంచాయతీ ఎన్నికలు విజయవంతమయ్యేందుకు పాటుపడిన ఎంపిడిఒ సుభాషిణి, ఎఇ శ్రీనివాసరావు, ఇఒపిఆర్‌డి వెంకటేశ్వరరావు, సిబ్బంది వంశీల అభినందన సన్మాన కార్యక్రమాన్ని పంచాయతీ కార్యదర్శులు మండల పరిషత్‌ మీటింగ్‌ హాలులో నిర్వహించారు. సన్మాన గ్రహీత సుభాషిణి మాట్లాడుతూ పంచాయతీ ఎన్నికలంటే గొడవలు జరుగుతాయని చాలా మంది భయపడతారన్నారు. పక్కా ప్రణాళికతో నిర్వహిస్తే ఏవిధమైన ఇబ్బందులు లేకుండా పూర్తి చేయొచ్చునన్నారు. గతంలో తాను పెనమలూరు, తోట్లవల్లూరు మండలాల్లో ఎన్నికలు నిర్వహించానన్నారు. గన్నవరం మండలంలో మంచిటీం దొరకడం వల్ల ఏ విధమైన సమస్యలు లేకుండా ఎన్నికలను విజయవంతం చేయగలిగామని చెప్పారు. ఇఒపిఆర్‌డి వెంకటేశ్వకరరావు ఎన్నికల నిర్వహణకు ఎంతో బాధ్యతగా పని చేసిన పంచాయతీ కార్యదర్శులు, సచివాలయ సిబ్బందికి ధన్యవాదాలు తెలిపారు. ఆర్‌డబ్ల్యుఎస్‌ ఎఇ రాణి, పంచాయతీ కార్యదర్శులు కోటేశ్వరరావు, పరమాత్మ, రాజారావు, సురేష్‌, మౌనిక, రాజేంద్రప్రసాద్‌ పాల్గొన్నారు.