Feb 01,2021 22:15

మాట్లాడుతున్న మంచు కరుణాకరరావు

టెక్కలి రూరల్‌: గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా, సజావుగా జరిగేందుకు సమర్థవంతంగా విధులు నిర్వర్తించాలని మండల ప్రత్యేక అధికారి డాక్టర్‌ మంచు కరుణాకరరావు అన్నారు. సోమవారం స్థానిక ఎంపిడిఒ కార్యాలయంలో ఎన్నికల నిర్వహణపై రూట్‌ ఆఫీసర్లు, పంచాయతీ కార్యదర్శులు, గ్రామ పరిపాలనాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల ప్రవర్తనా నియమావళి కచ్చితంగా పాటించాలని, ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. పోలింగ్‌ కేంద్రాల్లో ఏర్పాట్లు, మౌళిక సదుపాయాలు, ఇంటర్నెట్‌ సౌకర్యం సరిగ్గా ఉండేలా చూసుకోవాలని సూచించారు. రూట్‌ అధికారులు ముందుగా ఆయా రూట్లలో పూర్తి అవగాహన పెంచుకోవాలన్నారు. సమావేశంలో తహశీల్దార్‌ ఎన్‌.గణపతి, ఎంపిడిఒ పి.నారాయణమూర్తి, ఇఒపిఆర్‌డి డి.హెచ్‌.వి.రమణమూర్తి, తదితరులు పాల్గొన్నారు.