ఫొటో : మాట్లాడుతున్న విద్యుత్ శాఖ డివిజన్ ఎస్ఇ విజరుకుమార్‌రెడ్డి
సమిష్టి కృషితోనే సాధ్యం
-సకాలంలో విద్యుత్ సరఫరా పునరుద్దరణ
ప్రజాశక్తి-నెల్లూరు : నివర్ తుపాన్ కారణంగా విద్యుత్ సరఫరాలో అంతరాయం కలగకుండా, అంతరాయం కలిగితే తక్కువ వ్యవధిలో పరిష్కరించడం సమిష్టి కృషితోనే సాధ్యమైందని విద్యుత్ శాఖ డివిజన్ ఎస్ఇ విజరుకుమార్ రెడ్డి పేర్కొన్నారు. సోమవారం విద్యుత్ భవన్‌లోని ఆయన ఛాంబర్లో విలేకర్ల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వాతావరణ శాఖ నుంచి తుపాన్ హెచ్చరికలు వచ్చిన నాటి నుంచి విద్యుత్ శాఖ సిఎండి సలహాలు, సూచనలు మేరకు బృందాలను, సామాగ్రిని సిద్ధం చేసుకున్నామన్నారు. తుపాన్ ప్రభావం 24 నుంచి జిల్లాలో ప్రారంభమైనప్పటికీ 25, 26 వ తేదిల నుంచి తీవ్రంగా ఈదురు గాలలు వీచాయన్నారు. దీని వల్ల పలు విద్యుత్ స్థంబాలు కూలిపోయాయన్నారు. 27వ తేదీ నాటికి జిల్లాలో అత్యధిక ప్రాంతాలకు విద్యుత్ సరఫరాను పునరుద్ధరించగలి గామన్నారు. కొన్ని ప్రాంతాల్లో ఇంకా వరద నీరు ఉండటంతో మరమ్మతులు పూర్తి చేయలేని పరిస్థితి ఏర్పడిందన్నారు. తుపాన్ కారణంగా 33 కేవి ఫీడర్స్ 87 జిల్లాలో దెబ్బతిన్నాయన్నారు. 11 కేవీ ఫీడర్లు 800లకు పైగా దెబ్బతిన్నాయని వాటన్నింటికి మరమ్మతులు చేసి విద్యుత్ సరఫరా పునరావృతం చేశామన్నారు. 33 కెవి పోల్స్ 338, 11 కెవీ పోల్స్ 1523, ఎల్టి లైన్స్‌లో 1695పోల్స్ మరమ్మతులకు గురైనట్లు తెలిపారు. వ్యవసాయం, ఆక్వా పంటలకు విద్యుత్ సరఫరా చేసే పోల్స్ దెబ్బతిన్నట్లు సమాచారం ఉందన్నారు. విద్యుత సరఫరా పునరుద్ధరణకు ఇప్పటి వరకు రూ.3 కోట్ల 80 లక్షలు ఖర్చు చేశామన్నారు. ఈ ఖర్చు మరింత పెరిగే అవకాశం ఉందన్నారు. సమావేశంలో విద్యుత్ శాఖ అధికారిణి రమణదేవి ఉన్నారు.
ఫొటో : మాట్లాడుతున్న విద్యుత్ శాఖ డివిజన్ ఎస్ఇ విజరుకుమార్‌రెడ్డి