Oct 27,2021 21:58

ఫొటో : సర్వే చేపడుతున్న అధికారులు

ఫొటో : సర్వే చేపడుతున్న అధికారులు
సమగ్ర భూ హక్కు సర్వే
ప్రజాశక్తి- ఆత్మకూరు అర్బన్‌ : మండలంలోని బట్టే పాడు గ్రామంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం లో భాగంగా బుధవారం బట్టే పాడు ఎస్సీ కాలనీలో 60 గృహాలు సర్వే చేసినట్లు పంచాయతీ కార్యదర్శి హజరత్‌ బాబు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శాశ్వత భూ హక్కు అనే రిజిస్ట్రేషన్‌ ఈ ప్రక్రియ ద్వారా లబ్ధిదారులకు ఇవ్వాలనే ఈ పథకం ముఖ్య ఉద్దేశమని పంచాయతీ కార్యదర్శి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి హజరత్‌ బాబు , వి ఆర్‌ ఓ బికారి సాహెబ్‌ , ఇంజనీరింగ్‌ అసిస్టెంట్‌ ఖాజా మస్తాన్‌, వాలంటీర్లు సరస్వతి , లక్ష్మీదేవి తదితరులు పాల్గొన్నారు.