Mar 02,2021 21:49

చికిత్స పొందుతున్న శివనాగమణి

ప్రజాశక్తి - రాజంపేట : జాతీయ రహదారిలోని కళాంజలి కళ్యాణమండపం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు గాయపడ్డారు. మంగళవారం రామ్‌ నగర్‌కు చెందిన అశోక్‌, అతని భార్య శివనాగ మణి, ఇద్దరు కుమార్తెలు స్కూటీపై వెళ్తుండగా కళ్యాణ మండపం వద్దకు రాగానే టాటా సఫారీ కారు ఢకొీంది. సంఘటనలో ముగ్గురికి స్వల్ప గాయాలు అయ్యాయి. ఒక పాప తలకు దెబ్బ బలమైన గాయం కావడంతో మెరుగైన వైద్యం కోసం కడప రిమ్స్‌కు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేశారు.