
స్కాలర్షిప్, ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయాలి: ఎస్ఎఫ్ఐ
ప్రజాశక్తి - క్యాంపస్ : రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్‌లో ఉన్న స్కాలర్షిప్, పీజు రియింబర్స్‌మెంట్‌ను వెంటనే విడుదల చేసి ఎంసెట్, ఐసెట్, ఎడ్ సెట్, లాసెట్, డిగ్రీ, పీజీ అడ్మిషన్లు నిర్వహించాలని భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్ఎఫ్ఐ) నాయకులు శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం గోల్డెన్ జూబ్లీ ఆర్చ్ గేటు ముందు నిరసన తెలిపారు. అనంతరం యూనివర్శిటీ ఉపకులపతి ఆచార్య రాజారెడ్డికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్.మాధవ్ మాట్లాడుతూ 2019-20 విద్యాసంవత్సరం పూరైన విద్యార్థులకి సంబంధించి స్కాలర్షిప్ మరియు ఫీజు రీయింబర్స్మెంట్ ఒక్కపైసా కూడా ఇప్పటి వరకు రాలేదని విద్యార్థులు స్కాలర్షిప్, పీజు రియింబర్స్‌మెంట్ రాకపోవడంతో కోర్సులు పూర్తి చేసుకొన్న విద్యార్థులు ఉన్నత చదువులకు అవకాశం కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యాసంవత్సరం ప్రారంభించాల్సిన తరుణంలో ఇప్పటి వరకు డిగ్రీ, బి.టెక్, ఎంబిఎ, ఎంసిఎ, పిజి, లా, బి.ఇడి కోర్సు ఫీజులు నిర్ణయించకపోవడం వలన ఇప్పటికీ అడ్మిషన్లకు సంబంధించి స్పష్టత లేదని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా ఆఫీస్ బేరర్స్ అక్బర్, ప్రసన్న, నాగరాజు, రవి, నాయకులు హేమంత్, అల్తాఫ్, సూర్య ప్రకాష్ రెడ్డి, కైలాష్ వర్మ, భాస్కర్, ఉరుకుందు, గురు, నాగార్జున తదితరులు పాల్గొన్నారు.