Mar 02,2021 21:37

ఆలయ సిబ్బందితో మాట్లాడుతున్న డిఎస్‌పి

ప్రజాశక్తి - చాపాడు :మహాశివరాత్రి సందర్భంగా వివిధ ప్రాంతాల నుండి అల్లాడుపల్లెకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు జరగకుండా గట్టి బందోబస్తు ఏర్పాట్లు చేస్తామని ప్రొద్దుటూరు డిఎస్‌పి ప్రసాద్‌రవు అన్నారు. మంగళవారం వీరభద్ర స్వామి ఆలయ ఆవరణాన్ని ఆలయ ఇఒ శోభారాణితో కలిసి పండుగ సందర్భంగా చేయవలసిన ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేలాది మంది భక్తులు అల్లాడుపల్లెకు వచ్చే అవకాశం ఉంటుందని, అందుకు అనుగు ణంగా ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నామన్నారు. ట్రాఫిక్‌ సమస్య తలెత్త కుండా వాహనాలను నిలిపేందుకు ప్రత్యేక పార్కింగ్‌ ప్రదేశాలను ఏర్పాటు చేస్తామన్నారు. జాగారం సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సిబ్బందిని అందు బాటులో ఉంచుతామన్నారు. భక్తులు కూడా పోలీస్‌ సిబ్బందికి సహకరించాలన్నారు. కార్యక్రమంలో రూరల్‌ సిఐ విశ్వనాథరెడ్డి, ఎస్‌ఐ హరిప్రసాద్‌ అల్లాడుపల్లె సర్పంచ్‌ కిశోర్‌ కుమార్‌రెడ్డి, అర్చకులు చిన్నా, సిబ్బంది పాల్గొన్నారు.