Nov 25,2021 20:33

ప్రముఖ కొరియోగ్రాఫర్‌ శివ శంకర్‌ మాస్టర్‌ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్న విషయం తెలిసిందే. కరోనా కారణంగా పరిస్థితి సీరియస్‌ అవ్వడంతో హైదరాబాద్‌ ఏఐజీ ఆస్పత్రికి తరలించారు కుటుంబ సభ్యులు. అక్కడ గత నాలుగు రోజులుగా ఆయనకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. 75 శాతం ఊపిరితిత్తులకు ఇన్‌ ఫెక్షన్‌ సోకడంతో మాస్టర్‌ ఆరోగ్యం విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నారు. ఆయన వైద్యానికి రోజుకు లక్షల రూపాయలు ఖర్చు అవుతోంది. అయితే ఈ విషయం గమనించిన సోనూసూద్‌ తాను ఆ కుటుంబంతో టచ్‌లో ఉన్నాను అని, శివ శంకర్‌ మాస్టర్‌ ప్రాణాలు కాపాడడానికి చేతనైన సాయం చేస్తానని హామీ ఇచ్చారు. ఒక్క ఆయన కుటుంబంలోనే ముగ్గురు వ్యక్తులు కరోనా బారిన పడ్డారు. మాస్టర్‌ పెద్ద కొడుకు కూడా కరోనా సోకి, అపస్మారక స్థితిలో ఉన్నారు. శివ శంకర్‌ మాస్టర్‌ భార్య కరోనాతో హోం క్వారెంటైన్‌లో ఉన్నారు. చిన్నకొడుకు అజరు కృష్ణ ఒక్కడే ప్రస్తుతం తండ్రి, అన్న, అమ్మ ముగ్గురి బాగోగులు చూసుకుంటున్నారు.