Nov 30,2020 22:40

సిసి రోడ్ల నిర్మాణానికి భూమి పూజ చేస్తున్న నాయకులు

ప్రజాశక్తి - ఎమ్మిగనూరు అర్బన్‌: పట్టణంలోని 26వ వార్డులో ఎమ్మెల్యే ఎర్రకోట చెన్నకేశవ రెడ్డి ఆదేశాల మేరకు వైసిపి నియోజకవర్గ సీనియర్‌ నాయకులు ఎర్రకోట జగన్‌మోహన్‌ రెడ్డి అభివృద్ధి పనులకు భూమిపూజ చేశారు. సోమవారం 26వ వార్డు లక్ష్మన్న టాకీస్‌ వద్ద రూ.35 లక్షలతో సిసి రోడ్డు నిర్మాణం కోసం భూమి పూజ చేసి పనులు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. 14వ ఆర్థిక సంఘం నిధులు విడుదల చేసినట్లు మాజీ ఎమ్మెల్యే బీవీ గొప్పలు చెప్పుకుంటున్నారని విమర్శించారు. ఈ నిధులు వైసిపి ప్రభుత్వంలోనే విడుదలయ్యాయని చెప్పారు. మున్సిపల్‌ డిఇఇ వెంకటేశ్వర్లు, డాక్టర్‌ రఘు, మున్సిపల్‌ మాజీ చైర్మన్‌ బుట్టారంగయ్య, మైనార్టీ నాయకులు రియాజ్‌ అహ్మద్‌, సునీల్‌ కుమార్‌, టౌన్‌ బ్యాంక్‌ సయ్యద్‌ చాంద్‌, రజాక్‌, వడ్డె రంగన్న, పట్టణ యువజన ప్రెసిడెంట్‌ నజీర్‌ అహ్మద్‌, వెంకటాపురం బజారి, ప్రతాప్‌ రెడ్డి, విశ్వనాథ్‌, చంద్రమోహన్‌ రెడ్డి, శివ కుమార్‌, బజారి, సలీం, దారాల శ్రీను, గట్టు ఖాజా, వెంకట్‌ రెడ్డి, రాజా రెడ్డి, కుషల్‌, మాధవ్‌ పాల్గొన్నారు.