Apr 11,2021 14:42

ఏర్పేడు(చిత్తూరు): తిరుపతి పార్లమెంట్‌ సిపిఎం అభ్యర్థి నెల్లూరు యాదగిరిని గెలిపించాలని మండలంలోని రాజుల కండ్రిగలో ఆదివారం ప్రచారం నిర్వహించారు. సుత్తి, కొడవలి, నక్షత్రం గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని సిపిఎం రాష్ట్ర నాయకులు నూర్‌అహ్మద్‌, కరిముల్లా, రంగయ్య, వెంకటేశ్వరరావులు ఉపాధి కూలీలకు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. నిరంతరం ప్రజల మనిషిగా ఉండే యాదగిరిని ఈసారి పార్లమెంటుకు పంపిస్తే, సామాన్య జనం బాధలను అక్కడ వినిపించొచ్చన్నారు.