Mar 05,2021 19:00

ప్రజాశక్తి - కొవ్వూరు రూరల్‌
కొవ్వూరు మున్సిపల్‌ ఎన్నికల్లో 13వ వార్డు నుండి కౌన్సిలర్‌గా పోటీచేస్తున్న సిపిఎం అభ్యర్థి దగ్గు అశోక్‌ కుమార్‌ను గెలిపించాలని సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు ఎం.సుందరబాబు కోరారు. శుక్రవారం అభ్యర్థి అశోక్‌ ప్రచారంలో భాగంగా పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సుందరబాబు మాట్లాడుతూ నిత్యం ప్రజల మధ్య ఉండి విద్యార్థి, యువజన, రైతు, కార్మిక మహిళ, పట్టణ ప్రజల సమస్యలపై పోరాడుతున్న దగ్గు అశోక్‌ కుమార్‌ను గెలిపించాలని కోరారు. కౌన్సిల్లో ప్రశ్నించడానికి ఓటరు మహాశయులు ఒకసారి అవకాశం ఇవ్వాలని, ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు హక్కు వినియోగించుకుని డబ్బు రాజకీయాలకు అడ్డుకట్ట వేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో పట్టణ శాఖ కార్యదర్శి బిరా రవి, సభ్యులు డి.రాధాకృష్ణ, ఉండవల్లి పార్దు, గేల్లా కరుణాకర్‌ పాల్గొన్నారు.