
న్యూఢిల్లీ: ఈనెల మొదట్లో లక్ష్మీవిలాస్ బ్యాంక్‌పై ఆర్బిఐ విధించిన ఆంక్షలు తొలగిపోయాయి. ఇప్పుడు రూ.25,00కంటే ఎక్కువ విత్‌డ్రా చేసుకోవచ్చు. ఎందుకంటే నేటి నుండి లక్ష్మీ విలాస్ బ్యాంక్ శాఖలన్నీ సింగపూర్‌కు చెందిన డీబీఎస్ బ్యాంక్ భారతీయ విభాగాల కిందకు వచ్చాయి. దీంతో ''లక్ష్మీవిలాస్ బ్యాంక్ డిపాజిటర్లు, వినియోగదారులు ఇక నుండి డీబీఎస్ బ్యాంక్ వినియోగదారులుగా తమ ఖాతాలను నిర్వహించుకోవచ్చు. ఇది నవంబర్ 27 నుండి అమల్లోకి వస్తుంది. దీంతో ఆర్బిఐ విధించిన మారటోరియం నిలిచిపోతుంది. డీబీఎస్ బ్యాంక్ ఇక నుంచి లక్ష్మీవిలాస్ బ్యాంక్ కస్టమర్లకు సేవలు అందిస్తుందని ఎల్వీబీ రెగ్యూలేటరీకి చేసిన ఫైలింగ్‌లో పేర్కొంది. లక్ష్మీ విలాస్ బ్యాంకు (ఎల్వీబీ)ను డీబీఎస్ బ్యాంక్ ఇండియా లిమిటెడ్ (డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లిమిటెడ్-డీబీఎస్)లో విలీనం చేయడానికి బుధవారం కేంద్రమంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. డిపాజిట్ల ఉపసంహరణపై ఇక ఎటువంటి ఆంక్షలు ఉండవని ప్రకటించింది. ఈ నిర్ణయంతో ఎల్వీబీలోని 20లక్షల మంది ఖాతాద్లాకు చెందిన రూ.2వేల కోట్ల డిపాజిట్లతో పాటు 4వేల మంది ఉద్యోగులందరికీ రక్షణ లభిస్తుందని ప్రభుత్వం తెలిపింది.