ప్రజాశక్తి-హిందూపురం : పట్టణంలో రీలర్లు చేస్తున్న సమ్మెకు సిపిఎం, సిపిఐ నాయకులు మద్దతు తెలిపారు. నాయకులు వినోద్‌కుమార్, దాదాపీర్ సోమవారం మద్దతు పలికారు. ఈ సందర్భంగా నాయకులు వినోద్ కుమార్, రమణ, జబీఉల్లా మాట్లాడుతూ హిందూపురం పట్టణంలో ఐదు రోజుల నుండి రీలర్లు సమ్మె చేస్తున్న ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. ప్రభుత్వం అలసత్వం వీడి వారి సమస్యను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. చ సమస్యలన్నింటిని పరిష్కరించే వరకు పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలను నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రీలర్ల అసోసియేషన్ అధ్యక్షులు రియాజ్, కార్యదర్శి ముస్తఫా, సహాయకార్యదర్శి ఖలీల్, కోశాధికారి అల్లాబకాష్, అహ్మద్, సనావుల్లా, ఇస్మాయిల్ తదితరులు పాల్గొన్నారు.
ఎంపికి వినతి
పట్టుగూళ్ల మార్కెట్ ముందు రీలర్లు ఆందోళన చేస్తున్న విషయం తెలుసుకున్న స్థానిక ఎంపీ గోరంట్ల మాధవ్ సోమవారం దీక్షా శిబిరాన్ని సందర్శించి వారి సమస్యలను అడిగి తెలసుకోన్నారు. ఈ సందర్బంగా రీలర్లు ఆయనకు వినతిపత్రం సమర్పించారు. స్పందించిన ఎంపి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళతానని హామీ ఇచ్చారు.
సమ్మెకు మద్దతు చెబుతున్న సిపిఎం, సిపిఐ నాయకులు