Oct 28,2021 20:13

టాలీవుడ్‌ సీనియర్‌ హీరో అక్కినేని నాగార్జున గురువారం మధ్యాహ్నం ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డితో భేటీ అయ్యారు. నాగార్జునతో పాటు సినీ నిర్మాత ప్రీతమ్‌ రెడ్డి - నిరంజన్‌ రెడ్డి సహా మరికొందరు సినీ ప్రముఖులు ప్రత్యేక విమానంలో వచ్చి తాడేపల్లి సీఎం క్యాంపు కార్యాలయంలో జగన్‌ను కలిశారు. ఈ సందర్భంగా సినీ రంగానికి చెందిన వివిధ అంశాలపై జగన్‌తో ఆయన చర్చించినట్లు తెలుస్తోంది. ఇటీవల ఇండిస్టీలో జరిగిన కొన్ని కీలక పరిణామాలు - ఆన్‌లైన్‌ టికెటింగ్‌ సిస్టమ్‌ వంటి అంశాలు చర్చకు వచ్చాయని వార్తలు వస్తున్నాయి. ఏపీలో నాలుగు షో లకు పర్మిషన్‌ ఇవ్వడంతో పాటుగా వంద శాతం థియేటర్‌ ఆక్యుపెన్సీకి అనుమతి ఇచ్చినందుకు జగన్‌కు నాగార్జున బృందం కృతజ్ఞతలు తెలిపినట్లు సమాచారం.