May 18,2021 22:50

సిఎం సహాయనిధి చెక్కులను అందిస్తున్న ఎమ్మెల్యే ముత్యాలనాయుడు తదితరులు

చీడికాడ : చీడికాడ మండలంలో పలు గ్రామాలకు సంబంధించిన ఆరోగ్యశ్రీ వర్తించని ఐదుగురు నిరుపేదలకు వైద్యం నిమిత్తం సిఎం సహాయనిధి కింద రూ.2.30 లక్షల చెక్కులను మాడుగుల ఎమ్మెల్యే బూడి ముత్యాలనాయుడు, వైసిపి నాయకులు ఎర్ర అప్పారావు, గొల్లవిల్లి రాజబాబు మండల పరిషత్‌ కార్యాలయంలో అందజేశారు. దండి సురవరంనకు చెందిన బత్తుల ఈశ్వరరావుకు రూ.1.50 లక్షలు, కండివరంనకు చెందిన గుల్లపల్లి శిరీష్‌కు రూ.25 వేలు, చీడికాడకు చెందిన వేచలపు సత్యంనకు రూ.20 వేలు, తునివలసకు చెందిన సుంకర శ్రీనివాస్‌కు రూ.20 వేలు, వరహాపురంనకు చెందిన మిస్కా దేవుడుకు రూ.15 వేలు అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, ఆరోగ్యశ్రీ వర్తించని పేదలను ప్రభుత్వం ఆదుకుంటుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపిడిఒ జయప్రకాష్‌, డీటీ శ్రీరామ్మూర్తి, వైసిపి నాయకులు శంకర శ్రీను, పరవాడ అప్పారావు, చుక్క అప్పలనాయుడు పాల్గొన్నారు.